ప్రత్యేక అలంకరణలో బల్కంపేట అమ్మవారు
హైదరాబాద్(CLiC2NEWS): బల్కంపేట రేణుక ఎల్లమ్మ అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. పసుపు కొమ్ములు, రంగురంగుల గాజులతో ఈరోజు ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే అర్చకులు రేణుక ఎల్లమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకాలంకరణలో ఉన్న ఎల్లమ్మ తల్లిని భక్తులు దర్శించుకొని తరించారు.