బాల్టిమోర్ వంతెన ప్ర‌మాదం.. ఆరుగురి మృతి

ముందుగా హెచ్చ‌రించిన భార‌త సిబ్బందిపై జొ బైడెన్ ప్ర‌శంస‌

బాల్టిమోర్ (CLiC2NEWS): యుఎస్‌లోని బాల్టిమోర్ న‌గ‌రంలో భారీ నౌక‌ ఢీకొని ప‌టాప్‌స్కో న‌దిపై ఉన్న‌ ఫ్రాన్సిస్ స్కాట్ బ్రిడ్జి కూలిపోయిన విష‌యం తెలిసిందే. ఈప్ర‌మాదంలో ప‌లు వాహ‌నాలు నీటిలో ప‌డిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చందిన‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  మ‌ర‌ణించిన వారంతా వంతెన‌సై గుంత‌లు పూడుస్తున్న వార‌ని అధికార‌లు వెల్ల‌డించారు. నౌక‌లో ఉన్న 22 మంది భార‌తీయ సిబ్బంది అంతా క్షేమ‌మ‌ని, ఒక‌రికి స్వ‌ల్పంగా గాయాల‌య్యాయిని షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్ర‌క‌టించింది.  సిబ్బంది ప్ర‌మాదాన్ని ముందే గుర్తించి అధికారుల‌ను హెచ్చ‌రించ‌డంతో ప‌లువురు ప్రాణాల‌ను కాపాడార‌ని అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ప్ర‌శంసించారు.

స్టీరింగ్‌పై అదుపు కోల్పోవ‌డంతో నౌక.. బ్రిడ్జి పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో నౌక‌లో విద్యుథ్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని, వెంట‌నే ప్ర‌మాద స‌మాచారాన్ని నౌకా సిబ్బంది అధికారుల‌కు అందించారు. వంతెనపై వాహ‌నాలు నిలిపి వేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని బాల్టిమోర్ అగ్నిమాప‌క శాఖ క‌మ్యూనికేష‌న్ డైరెక్ట‌ర్ తెలిపారు. అర్ధ‌రాత్రి నౌక ప్ర‌మాదంలో చిక్కుకుంద‌ని తెలిసిన వెంట‌నే 12 సెక‌న్ల హెచ్చ‌రిక‌ను రేడియో సంకేతాల ద్వార సిబ్బంది అమెరికా అధికారుల‌కు పంపించారు. వారు 90 సెక‌న్లోని వంతెన‌పై ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

నౌక ఢీకొని కూలిపోయిన బ్రిడ్జ్‌.. న‌దిలో ప‌డిపోయి 20 మంది గ‌ల్లంతు

Leave A Reply

Your email address will not be published.