బీజేపీ యువమోర్చా కార్యదర్శిగా నాళం ఫణిప్రకాష్
మండపేట (CLiC2NEWS): బీజేపీ అమలాపురం పార్లమెంట్ జిల్లా యువమోర్చా కార్యదర్శిగా మండపేటకు చెందిన నాళం ఫణిప్రకాష్ నియమితులయ్యారు. అమలాపురం పార్లమెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షులు మానేపల్లి అయ్యాజీవేమ, జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణలు సభ్యుల పేర్లు సూచించగా యువమోర్చా అధ్యక్షుడు కటికిరెడ్డి గంగాధరం యువమోర్చా కమిటీని ప్రకటించారు. ఈ మేరకు ఫణి ప్రకాష్ ను కార్యదర్శిగా ధృవీకరిస్తూ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా కోన సత్యనారాయణ నూతనంగా యువమొర్చా కార్యదర్శిగా పదవిని అలంకరించిన ఫణికి బీజేపీ కండువా వేసి అభినందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా, పట్టణ ఉపాధ్యక్షులుగా పని చేసి పార్టీలో అనేక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. కష్టపడే తత్వం కలిగిన ఫణికి పదవి రావడం ఆనందదాయకం అన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాళం ప్రకాష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, కోన సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.