నేడు నాందేడ్‌లో బిఆర్ఎస్ బహిరంగ సభ

హైదరాబాద్ (CLiC2NEWS): భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) బహిరంగ సభను ఆదివారం నాందేడ్‌లో నిర్వహించనున్నారు. తొలిసారిగా తెలంగాణేతర ప్రాంతంలో బిఆర్ ఎస్ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో జరపనున్న సభకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరుకానున్నారు. నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్ సింగ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు చేశారు.
ఈ సభను విజయవంతం కోసం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు మహారాష్ట్రలోని తెలుగుప్రజల నివసిస్తున్న చోట సమావేశాలు ఏర్పాటు చేసి.. వారితో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ విధంగా సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న విఠల్ రెడ్డి, షకీల్ ఇతర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.