గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నిరసన
హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలంటూ దాదాపు 2 వేల మంది అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులు నినాదాలతో తెంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఈ ర్యాలీ తెలంగాణ జన సమితి కార్యాలయం నుండి ప్రారంభమయి టిఎస్పిఎస్సి కార్యాలయం పరిసరాలకు వరకు కొనసాగింది. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్య దర్శి అనితా రామచంద్రన్‌కు వినతి పత్రం అందించారు.
ర్యాలీలోని కొంత మంది అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.