కార్టూనిస్ట్ భూపతికి `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` అవార్డు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహొత్నవ్ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా .. జాతీయ కార్టూన్ మాగజైన్ ప్రముఖ Cartoon Watch , ఛత్తీస్‌గ‌ఢ్‌ సాంస్కృతిక శాఖ సహకారంతో జాతీయ స్థాయిలో `ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ 2021` అనే అంశం ఆధారంగా నిర్వహించిన పోటీలో వివిధ రాష్ట్రాల నుండి వందల మంది కార్టూనిస్టులు పాల్గొన్నారు.

శ‌నివారం సాయంత్రం ప్రకటించిన కార్టూన్ ఫలితాలలో CLIC2NEWS కార్టూనిస్టు తునికి భూపతి ద్వితీయ బహుమతి గెలుపొందారు. ఈ మేర‌కు Cartoon Watch Magazine ప్రకటించింది. గెలుపొందిన వారికి క్యాష్ ప్రైజ్, మెమోంటో, సర్టిఫికేట్ ఆన్లైన్లో పంపించారు.

ఈ ఏడాది మూడు అవార్డులు అందుకున్న భూపతి

2021 సంవ‌త్స‌రానికి గాను జాతీయ స్థాయిలో నిర్వ‌హించిన ప‌లు కార్టూన్ పోటీల్లో భూప‌తి 3 అవార్డులు గెలుచుకున్నారు. వాటిలో రెండింటిలో ద్వితీయ బహుమతి పొంద‌గా.. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నిర్వహించిన మాజీ ప్రధాని పి.వి.నరసింహ రావు కారికే చర్ పోటీలో ప్రత్యేక బహుమతి అందుకున్నారు. ఈ సంద్భంగా కార్టూనిస్టు భూప తి పలువురు ప్రముఖులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.