కరాటే పోటీల్లో విజేతలకు చైర్ పర్సన్ అభినందనలు
మండపేట (CLiC2NEWS): కుంగ్ ఫు కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్ధులకు చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అభినందనలు తెలిపారు. గోల్డెన్ డ్రాగన్ చైనీస్ కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ తాతపూడి అబ్బులు, లోకల్ మాస్టర్ సీహెచ్ హరీష్ కుమార్ ల వద్ద కుంగ్ ఫు విద్యను అభ్యసించిన పట్టణానికి చెందిన బి శేఖర్, పి సతీష్ లు ఇటీవల రాజమండ్రిలో రాష్ట్రస్థాయి కుంగ్ ఫు కరాటే పోటీల్లో పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్ విభాగంలో స్పారింగ్ పోటీల్లో పాల్గొని వీరిరువురు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించి పథకాలు గెలిచారు. ఈ సందర్భంగా శేఖర్ సతీష్ లను చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కుంగ్ విద్యార్థులను అభినందించి వారి మెడలో మెడల్స్ ను వేశారు. ఈ సందర్భంగా రాణి మాట్లాడుతూ కుంగ్ విద్యలో రాణించి బ్లాక్ బెల్ట్ వరకూ ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిలర్ లు చిట్టూరి సతీష్, మందపల్లి రవికుమార్, గ్రంథి వీర వెంకట శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, పిల్లి శ్రీనివాస్, వైసీపీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.