సంత మార్కెట్ లో చింతలపూడి సత్తిబాబు 12వ సారి ఏకగ్రీవం
చరిత్ర సృష్టించిన సత్తిబాబు

మండపేట (CLiC2NEWS): మండపేట పురపాలక సంఘంలో సర్ధార్ వేగుళ్ల వీర్రాజు సంత మార్కెట్ అధ్యక్షునిగా పట్టణ ప్రముఖుడు చింతలపూడి సత్తిబాబు 12వ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాధారణంగా పురపాలక సంఘ సంత మార్కెట్ లో ఒకటి రెండు సార్లు మించి ఎవరూ ఏకగ్రీవంగా ఎన్నిక కారు. అయితే సత్తిబాబు కు పేరు ప్రఖ్యాతులను బట్టి 12 పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికై పేరు తెచ్చుకున్నారు. మండపేట పురపాలక సంత మార్కెట్ కు ఎంతో పేరుంది. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్కెట్ లో పలు సమస్యలు తిష్ట వేసుకున్నాయి. సత్తిబాబు వాటిని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారు. 12 వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పట్టణ ప్రముఖులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.