తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్ రాఖీ శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాఖీ పౌర్ణమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా వుండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముల్లకు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సిఎం ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.