TS: స్థానిక సంస్థలకు రూ.432కోట్ల నిధులు..
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ సంస్థలకు రూ.432కోట్ల నిధులను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కేటాయించింది.
- గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్లు
- మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు
- జిల్లా పరిషత్‌లకు రూ.125.95కోట్లు
ఈ నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేస్తున్నందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు.