తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య‌మంత్రి కెసిఆర్

హైదరాబాద్‌ (CLiC2NEWS): ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ముఖ్య‌మంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని, వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని నినదించిన కాళోజీ జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటున్నది సిఎం పేర్కొన్నారు. ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కాళోజీ పురస్కారాన్ని ఈ ఏడాది అందుకుంటున్న ప్రముఖ కవి రచయిత పెన్నా శివరామకృష్ణ కు ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.