ఎంబిబిఎస్ ఫ్రీ సీటు సాధించిన విద్యార్థికి అభింనందన
మండపేట (CLiC2NEWS): ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ లో సీటు సాధించిన విద్యార్థి షేక్ మొహిద్దీన్ బాబా ను ఛైర్పర్సన్ దుర్గారాణి అభినందించారు. షేక్ మొహిద్దీన్ బాబా తండ్రి రాడ్ బెండింగ్ కార్మికుడు. తన కుమారుడిని కష్టపడి చదివిస్తూ వైద్య విద్యలో సీటు సాధించేలా ప్రోత్సహించారు. ఈ సందర్బంగా విద్యా వికాస్ కళాశాలలో షేక్ మొహిద్దీన్ బాబాను సత్కరించారు. చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మాజీ చైర్పర్సన్ చుండ్రు వరప్రకాశ్, జిన్నూరి సత్య సాయిబాబా, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బొల్లంరెడ్డి సత్యనారాయణ, టీడీపీ నాయకుడు ఉంగరాల రాంబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. విద్యార్థి, తల్లి తండ్రులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే ఉన్నతంగా తీర్చిదిద్దిన కళాశాల అధ్యాపకులను ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యావికాస్ డైరెక్టర్ వర్రే సత్యనారాయణమూర్తి, ఇంఛార్జ్ డి. శ్రీనివాస్ కలిసి మొహిద్దీన్ బాబాకు రూ.20,000 ప్రోత్సాహక నగదు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లి తండ్రులు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ గుండు రామ తులసి, కాళ్ల బాబు, కొమ్ము రాంబాబు, గుండు తాతరాజు, చెన్నా రాంపండు, మచ్చా నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
[…] […]