India Corona: మళ్లీ పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. నిన్న కరోనా కొత్తకేసుల నమోదు భారీగా తగ్గగా.. ఇవాళ తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.20 కోట్లకు చేరింది.
- తాజాగా 40,013 మంది బాధితులు కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,12,20,981 మంది కొలుకొని డిశ్చార్జి అయ్యారు.
- రికవరీ రేటు 97.45శాతానికి చేరుకుందని పేర్కొంది.
- వైరస్ బారినపడి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కాగా ఇప్పటి వరకు దేశంలో 4,29,179 మంది మృతి చెందారు.
- ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,86,351గా ఉన్నాయి.
- టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.