అక్రమ నల్లా కనెక్షన్.. ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న ముగ్గురిపై జలమండలి అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మేడిపల్లి పరిధిలోని ఎన్ ఐఎన్ కాలనీకి చెందిన పి. సత్యనారాయణ, తిరుపతి, శ్రీధర్‌లు అక్రమంగా మంచినీటి పైపులైన్ వేసుకున్నారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. వారిపై సెక్షన్ 430 కింద కేసు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989992268 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రకటనలో తెలిపారు.