విజయనగరం జిల్లాలో కుటుంబం ఆత్మహత్య..!
విజయనగరం (CLiC2NEWS): జిల్లాలోని కొత్తవలస మండలం, చింతలపాలెంలో ఓ కుటుంబం బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరం, మర్రిపాలెం పరిధిలో నివాసముంటున్న ఎం డి మొహినుద్దీన్, భార్య, కూతురు, కుమారుడు చింతలపాలెంలోని బావిలో దూకారు. ఈ ఘటనలో మొహినుద్దీన్ అతని భార్య, కుమార్తె మృతి చెందారు. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియరాలేదు.