AP: మహిళల రక్షణ కోసమే దిశ యాప్
జగ్గంపేటలోని దిశ యాప్ అవగాహన సదస్సులో హోంమంత్రి సుచరిత
జగ్గంపేట (CLiC2NEWS) : మహిళల రక్షణకు ముఖ్యమంత్రి దిశ యాప్ , దిశ చట్టాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా మురారి వద్ద ఆమెకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు స్థానిక నాయకులతో కలిసి స్వాగతం పలికారు. తరువాత మల్లేపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు షిడ్ బాల్స్ నాటారు. అనంతరం జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో దిశ యాప్ అవగాహన సదస్సు ఎమ్మెల్యే చంటి బాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హోంమంత్రి పాల్గొని మాట్లాడారు. ముందుగా సభాప్రాంగణంలో ఉన్న మహిళలను ఉద్దేశించి దిశ యాప్ ఎంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు అని అడిగారు. మహిళలను తన అక్కచెల్లెలుగా భావించి మహిళా రక్షణ కోసమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ దిశ యాప్ తీసుకురావడం జరిగిందని ఆమె అన్నారు. దేశంలో అనేక చోట్ల మహిళలపై ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలతో రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగకుండా చూడడానికి దిశ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళలకు కార్పొరేషన్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ మంది మహిళలను చైర్మన్ లుగా చేసిన ఘనత మన జగనన్నకే చెందుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటి బాబు మాట్లాడుతూ మహిళల్లో దిశా యాప్ పై అవగాహన కల్పించాలని తూర్పు గోదావరి జిల్లా ఎన్ను కోవడం అందులో మన జగ్గంపేట నియోజవర్గం తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం అలాగే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ మీరు ఉపయోగించినట్లయితే క్షణాల్లో మిమ్మల్ని పోలీసు వారి సహకారంతో కాపాడడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజి కేవీ మోహనరావు, జిల్లా ఎస్పీరవీంద్రనాథ్ బాబు, దిశా పోలీస్ స్టేషన్ డీఎస్పీ, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ శాకా రత్నకుమారి, రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హేమ శైలు సుబ్బారావు, బండారు రాజా వామ్మి రఘురాం, అత్తులూరి నాగబాబు, భూపాలపట్నం ప్రసాద్, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఎస్సై లు లక్ష్మీకాంతం, శోభన కుమార్, అప్పలరాజు ,జగ్గంపేట నియోజకవర్గం లోని గ్రామ మహిళా పోలీసులు ,వాలంటీర్లు, అధిక సంఖ్యలో మహిళలు అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.