కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసరాల పంపిణీ..
రాయవరం (CLiC2NEWS): కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వాళ్లకు పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాయవరం మండలం లొల్ల గ్రామంలో కంపెనీ ప్రతినిధులు బాజీవల్లి ధర్మ రావు, ప్రమోద్ పాండా, వాల్మీకి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రెసిడెంట్ సిహెచ్ జానకి రాంబాబు కంపెనీ చేస్తున్న ఈ పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు. ఏ సహాయమైనా తమ గ్రామస్తులు తరపున చేయుటకు సంసిద్ధత వ్యక్తం చేసినారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు మరియు అభివృద్ధికి తమ పైప్లైన్ ద్వారా సరఫరా చేస్తున్న గ్యాస్ ఉపయోగపడుతుందని, దాని సురక్షిత అందరి బాధ్యత అని వారు పేర్కొన్నారు.