ఎమ్మెల్సి కవిత అరెస్టుపై ఇడి ప్రకటన..
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ ఎస్ ఎమ్మెల్సి కవితను అరెస్టుపై ఇడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23 వరకు కవితను కస్టడీకి తీసుకున్నట్లు ఇడి వెల్లడించింది. అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది.
ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రివాల్, మనీస్ సిసోడియాతో కలిసి.. 2021-22 లో మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు తెలిపారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి.. హోల్‌సేల్ డీలర్ల నుండి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మొత్తం రూ. 128.79 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు.