యుపి మాజీ సిఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

లఖ్‌నవూ (CLiC2NEWS): ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ గురుగ్రామ్‌లోని వేదాంత ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన.. సోమవారం ఉదయం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఆగస్టు 22 నుండి ములాయం సింగ్ హాస్పిటల్‌లోనే ఉన్నారు. గతవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసియులో చికిత్సనందిస్తున్నారు.
ములాయం సింగ్ 1989లో మొదటిసారిగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1992లో ఆయన సొంతంగా సమాజ్‌వాదీ పార్టీ స్థాపించారు. ఆయన తన రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్టు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.