నాగర్‌కర్నూల్ జిల్లాలో నలుగురు చిన్నారులు మృతి!
బిజినేపల్లి (CLiC2NEWS): ఏం కష్టమొచ్చిందో గాని తన నలుగురు పిల్లలను కాల్వలో పడేసింది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 7 నెలల బాలుడు ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం మంగనూరులో జరిగింది. కుటుంబ కలహాలతో ఆ తల్లి ఈ విధంగా చేసిందని భావిస్తున్నారు. వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.