బిల్డింగ్ మెటీరియల్ అసోసియేషన్ అధ్యక్షునిగా గారపాటి ఎన్నిక..

మండపేట(CLiC2NEWS): మండపేట బిల్డింగ్ మెటీరియల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా తిరిగి మండపేట పట్టణానికి చెందిన గారపాటి రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత రెండు పర్యాయాలు గా ఆయన అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సైదిల్లిపేటలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. బిల్డింగ్ మెటీరియల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు దివంగత కంచర్ల మాణిక్యాలరావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండేవారు. సమావేశంలో తొలుత ఆయన మృతికి సంతాపం తెలిపిన అనంతరం కార్యాచరణపై చర్చించారు. కరోనా ప్రభావంతో బిల్డింగ్ మెటీరియల్ కు సంబంధించిన వ్యాపారస్తులు అందరూ తీవ్ర నష్టాలు చవిచూశారు అని ఈ సందర్భంగా సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ సడలించిన నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించినవారికి విక్రయాలు చేయాలని, సామాజిక దూరం పాటించాలని సంఘం తీర్మానించింది. అనంతరం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గారపాటి రాజశేఖర్, కార్యదర్శిగా గనిశెట్టి రాధాకృష్ణ, కోశాధికారిగా కంచర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా యాళ్ల శ్రీనివాస్, సింగంశెట్టి రఘులు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్సులుగా కేశవరపు శ్రీనివాసరావు, రిమ్మలపూడి ఈశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గా రవితేజ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని సభ్యులు ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.