TS: అంగ‌న్‌వాడి టీచ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

హైదారాబాద్‌ (CLiC2NEWS):

తెలంగాణ రాష్ట్రంలోని అంగ‌న్‌వాడి టీచ‌ర్లు, హెల్ప‌ర్ల‌కు ప్ర‌భుత్వం శుభవార్త తెలిపింది. మిని కేంద్రాల‌ను ప్ర‌ధాన అంగ‌న్‌వాగీ కేంద్రాలుగా చేసింది. అంతేకాకుండా ఉద్యోగ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 65 సంవ‌త్స‌రాల‌కు పెంచింది. ఈ మేర‌కు రాష్ట్ర స‌ర్కార్ జిఒను జారీ చేఇసంది. ప్ర‌త్యేక ఆర్ధిక సాయం కింద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే టీచ‌ర్ల‌కు రూ. ల‌క్ష‌, హెల్ప‌ర్ల‌కు రూ. 50వేలు భృతిని అంద‌జేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాకుండా విర‌మ‌ణ అనంత‌రం ఆస‌రా పెన్ష‌న్‌కూడా మంజూరు చేయ‌నుంది.

Nirmal: అంగ‌న్వాడీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి..

Leave A Reply

Your email address will not be published.