ముగ్గురు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు అరెస్టు వారెంట్ జరీచేసిన న్యాయస్థానం
విజయవాడ (CLiC2NEWS): విజయవాడ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ముగ్గురు వైఎస్ ఆర్ ఎమ్మెల్యేలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. 2015లో విజయవాడ బస్టాంట్ ఎదుట ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ ఆర్ పార్టీ నేతలు ధర్నా చేశారు. ఆందోళనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుత టిడిపి నేత వంగవీటి రాధాకు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.