నామినేటడ్ కోటా ఎమ్మెల్సీ పేర్లు తిరస్కరణ.. గవర్నర్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొందరరాజన్ నామినేటడ్ కోటాలో కేబినేట్ సిఫార్సు చేసిన పేర్లను తిరస్కరించారు. మంత్రి మండలి సిఫార్సు చేసిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను.. తగిన అర్హతలు లేనందున గవర్నర్ తిరస్కరించినట్లు సమాచారం. ఆర్టికల్ (5) కింద అర్హతలు సరిపోవన్నారు. అర్హతలు ఉన్న వారు ఎంతో మంది ప్రముఖులు ఉండగా.. తగిన అర్హతలు లేకుండా నామినేట్ చేయడం తగదన్నారు. ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు ఇవ్వకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను సిఫార్సు చేయడం సరికాదన్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని మంత్రి మండలి, సిఎంకి సూచించినట్లు గవర్నర్ వెల్లడించారు.