ఆయన ఓ పదభవన మెస్ట్రీ

ఆయన ఓ పదభవన మెస్ట్రీ
వారే మన సిరి వెన్నెల సీతారామ శాస్త్రి
పాటల ప్రవాహం ఆగిపోయింది.
వారికలం నుంచి ఎన్నో పాటలు జాలువారాయి.ఒకో పాట ఒకో దృశ్యాన్ని సాక్షాత్కరింప చేసింది.
తెల్లరింది లేవండోయి అంటూ మనను నిద్ర లేపిన సీతారామశాస్త్రి అస్తమయం బాధాకరం.
జగమంత కుటుంబంనాది అంటూ…ఏకాకిగా గోల చేసిన కవివరేణ్యులు సిరివెన్నెల
వెన్నెల పూతల తన మనస్సులోని మహిమను తెలియ చేసిన మనసుకవి.
ఈ గాలి…ఈ నీరు…సెలఏళ్ళ సౌందర్యాన్ని పుట్టిన వూరు మమకారాన్ని,
అందాల సింగిడిని అంధుడికి చూపించిన అక్షర శిల్పిఆతడు.

సీనియర్ పాత్రికేయులు
పెన్నులో సిరాను వెన్నెల గా మార్చిన ఒకే ఒక కవి సీతారామా శాస్త్రి
నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని. అగ్గి తోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని…
” అంటూ సమాజానికి హిత బోధ చేసిన ఘనుడు..‘‘
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాకా అంటూ మంగళ సూత్ర మహిమను చెప్పిన మాన్యుడు.
‘‘నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూ రాత్రుల అందాన్ని అందులోని మర్మాన్ని చెప్పారు.
అలాగే నేటిరాజకీయ సామాజిక వ్యవస్థను ప్రశ్నిస్తూ ‘‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా ’’ అంటూ ప్రశ్నించారు.
బలపం పట్టి బామ్మ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా అని రాసినా….
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ సానుకూల దృక్ఫథాన్ని పాటల ద్వారా తెలియ చెప్పేందుకు ప్రయత్నం చేశారు.
బోటనీ పాటముంది..మ్యాటనీ ఆట ఉంది..దేనికో ఓటు చెప్పరా అంటూ హుషారైన పాట రాసి యువతను మెప్పించారు.
శాస్త్రి గారిని ఇంత తొందరగా తన వద్దకే తీసుకెళ్లిన ఆది భిక్షువుడిని ఏమని అడుగుదాం.
మనకు అక్షరాల పాటల పూ దోటలు నిర్మించే మేస్ట్రీ ఇక రారా అని అడుగుదాం.
ఎస్.వి.రమణా చారి
సీనియర్ పాత్రికేయులు
9 8 4 9 8 8 7 0 8 6