బస్సునే కొట్టేసిన దొంగ..
సిద్దిపేట (CLiC2NEWS): ఎవరైనా డబ్బులు, బంగారం, బైక్‌లు, కార్లు కొట్టేస్తారు. కానీ ఈ దొంగ ఏకంగా ఆర్టిసి బస్సునే ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన స్వామి తన బస్సును ఆర్టీసీలో అద్దెకు నడిపిస్తున్నాడు. ఆ బస్సు సిద్దిపేట-హైదరాబాద్‌కు నడుపుతారు. ఆదివారం రాత్రి డ్రైవర్ బస్సును పార్కింగ్ చేసి.. తాళం మరిచిపోవడంతో బందెల రాజు బస్సును దొంగిలించాడు. అనంతరం వేములవాడకు తీసుకెళ్లాడు. సోమవారం ఉదయం సిద్దిపేటకు తీసుకెళ్తానని ప్రయాణికులను ఎక్కించుకొని.. వారి వద్దనుండి డబ్బులు వసూలు చేశాడు. ఆర్టిసి బస్సు కావడంతో ప్రయాణికులకు ఎలాంటి అనుమానం రాలేదు. బస్సు బయలు దేరి.. తంగళ్లపల్లి మండలం, సారంపల్లి- నేరెళ్లు మార్గంలో బస్సు ఆగిపోవడంతో రాజు అక్కడినుండి పరారయ్యడు.
డీజిల్ అయిపోవడంతో బస్సు ఆగిపోయింది. డీజిల్ తెస్తానని వెళ్లిన డ్రైవర్ ఎంతసేపటికీ రాకపోవడంతో ప్రయాణికులు వేరే వాహనాల్లో వెళ్లిపోయారు. బస్సు రోడ్డు పక్కన ఉండటాన్ని గమనించిన ఇతర ఆర్టిసి డ్రైవర్లు కంట్రోలర్‌కు సమాచారం అందించారు. బస్సు యజమాని స్వామికి సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ల్ ఫిర్యాదుచేయగా.. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.