రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు..వైద్యారోగ్య శాఖ అప్రమత్తం..

హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కేంద్రప్రభుత్వం JN.1 వ్యాప్తిపై రాష్ట్రలను అప్రమత్తం చేసింది. మూడు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్.. JN.1 ఇప్పటి వరకు 21 కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరి క్రిస్టినా, డిహెచ్ రవీంద్రనాయక్, డిఎం త్రివేణి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్ రాజారావు తదితర అధికారులు పాల్గొన్నారు. గురువారం అన్ని ప్రధాన ఆస్పత్రులలో మాక్ డ్రిల్ పూర్తి చేయాలని, ఆస్పత్రులకు అవసరమైన డిఎస్ ఎంఎస్ ఐడిసి ద్వారా తీసుకోవాలని మంత్రి చెప్పారు. కొవిడ్ పరీక్షలు చేసిన అనంతరం నమూనాలను విధిగా ఉప్పల్‌లోని సిడిఎఫ్‌డికి పంపాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటి రేటు 0.31గా ఉందని వైద్యాధికారులు మంత్రికి వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 14 కి చేరింది. కొవిడ్‌తో ఒకరు మృతి చెందినట్లు సమాచారం.