వ‌ర్షంలో భాగ్య‌న‌గ‌రం..!

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో మ‌ళ్లీ వాన దంచికొట్టింది. వ‌రుస‌గా రెండోరోజు హైద‌రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. ఒక్క‌సారిగా కురిసిన వ‌ర్షంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోఠి, బేగంబ‌జార్‌, సుల్తాన్ బ‌జార్‌, అబిడ్స్‌, నాంప‌ల్లి, బ‌షీర్‌బాగ్, నారాయ‌ణ‌గూడ ప్రాంతాల‌లో రోడ్లు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లు ప్రాంతాల్లో కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. తెలంగాణ‌లో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు, తేలిక‌పాటి నుంచి మోస్తురు వ‌ర్ష‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.

 

Leave A Reply

Your email address will not be published.