తెలంగాణ‌లో నేడు, రేపు భారీ వ‌ర్షాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశమున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఇవాళ వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్‌, భువ‌న‌గిరి, ఆసిఫాబాద్ , మంచిర్యాల , సిద్దిపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్క‌ర్నూల్ జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం. శుక్ర‌వారం హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్‌, మ‌హబూబాబాద్, భువ‌న‌గ‌రి , న‌ల్గొండ‌, నాగ‌ర్ క‌ర్నూల్లో.. శ‌నివారం రంగారెడ్డి , మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం. ఆయా జిల్లాల‌కు ఎల్లో హెచ్చ‌రిక‌ల‌ను వాతావ‌ర‌ణ శాఖ జారీ చేసింది. గంట‌కు 30-40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.