ఇక నుండి ప‌గ‌టిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో ఇక నుండి ప‌గ‌టిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు చేప‌ట్ట‌నున్న‌ట్లు హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయ‌ల్ డేవిస్ తెలిపారు. మింట్ కాంపౌండ్‌లో నిర్వ‌హించిన స్పెష‌ల్ డ్రైవ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సిపి మాట్లాడుతూ.. జూన్ నెల‌లో నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో ఓ స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్ మ‌ద్యం సేవించి ప‌ట్టుబ‌డ్డాడని.. మొత్తం 35 మంది స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్లు ఈ త‌నిఖీల్లో దొర‌క‌డం షాక్‌కు గురిచేసింద‌న్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ .. వీకెండ్స్‌లో మాత్రం నిర్వ‌హిస్తార‌నే భావ‌న‌తో ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. బ‌స్సు , వ్యాన్, ఆటో డ్రైవర్లు ప‌గ‌లు కూడా మ‌ద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నార‌న్నారు. అందుకే ప‌గలు కూడా ఈ త‌నిఖీలు చేయాల‌ని నిర్ణ‌యిచిన‌ట్లు తెలిపారు.

మైన‌ర్ డ్రైవింగ్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు సిపి తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 4,500 మైన‌ర్ డ్రైవింగ్ కేసులు న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు. మైన‌ర్ డ్రైవింగ్‌లో ప‌ట్టుబ‌డితే 25 ఏళ్ల వ‌ర‌కు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ట్రాఫిక్ సిపి జోయ‌ల్ హెచ్చ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.