శంషాబాద్‌లోని 181 ఎకరాల భూవివాదంపై హైకోర్టు తీర్పు..
హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్‌లోని 181 ఎకరాల భూ వివాదంపై నేడు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. శంషాబాద్‌లో రూ. కోట్ల విలువ చేసే 181 ఎకరాల భూమి హెచ్ఎండిఎకి చెందినదేనని హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. దీనిపై దాఖలైన భూ ఆక్రమణదారుల పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ భూముల వివాదం పై ఉన్నత న్యాయస్థానంలో ఒక సంవత్సరంపాటు వాదనలు జరిగినట్లు సమాచారం. తప్పుడు సమాచారంతో కబ్జాకు యత్నించారని హెచ్ఎండిఎ తరపు న్యాయవాది కోర్టులో వివరించారు. ఆక్రమణకు గురైన భూములన్నీ హెచ్ఎండిఎకి చెందనవని పూర్తి ఆధారాలు కోర్టులో సమార్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం హెచ్ఎండిఎకు అనుకూలంగా తీర్పునిచ్చింది.