టిజిపిఎస్సీకి హైకోర్టులో ఊరట
హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్ -1 పరీక్ష విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)కి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఇవాళ (బుధవారం) Wednesday సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబరు 15కి వాయిదా వేసింది.
సింగిల్ జడ్జి గ్రూప్ 1 తుది మార్కల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించిన విషయం విధితమే. అలాగే మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో మళ్లీ మూల్యాంకనం చేయించాలని.. అలా కాని పక్షంలో పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ కే సులో సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో డివిజన్ బెంచ్ ఇవాళ (Wednesday )విచారణ చేపట్టి స్టే విధించింది. అలాగే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సిజె జస్టిస్ ఎకె సింగ్ స్పష్టం చేశారు.
Also Read: తమిళ సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదురు
[…] టిజిపిఎస్సీకి హైకోర్టులో ఊరట […]