26, 27 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వానలు!
హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో 25న ఏర్పడనున్న వాయుగుండంతో ఈ నెల 26, 27వ తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
25వ తేదీన ఏర్పడనున్న అప్పపీడనం 26వ తేదీనాటికి వాయుగుండంగా బలపడి 27వ తేదీన ఒడిశా, ఉత్తరాంధ్ర లో తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
26వ తేదీన…
ఈ అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో 26న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగంల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
అలాగే 27 వ తేదీన..
ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : టిజిపిఎస్సీకి హైకోర్టులో ఊరట
[…] […]
[…] […]