జనసేన నాయకుల హౌస్ అరెస్టు
మండపేట (CLiC2NEWS): జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులకు వినతి పత్రం అందించే కార్యక్రమం చేపడితే తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం శోచనీయమని జనసేన పార్టీ అధికార ప్రతినిథి శెట్టిరవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం కఅడ్డుకోవడం అప్రజాస్వామికమని జనసేనపార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి శెట్టి రవి, నామాల చంద్రరావు లు పేర్కొన్నారు.మండపేట లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు తమ ఇళ్లకు వచ్చి తనతోపాటు తమ పార్టీ నాయకుడు నామాల చంద్రరావును తమ పార్టీకి ఏ సంబంధం లేని అధికారి శ్రీనివాస్ ను హౌస్ అరెస్టులు చేశారని చెప్పారు. వైసీపీ అధికార బలంతో ఇలాంటి చర్యలకు పాల్పడటం అప్రజాస్వామికం అని అన్నారు. నిరుద్యోగ సమస్యలపై తమ పార్టీ స్పందిస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధరాత్రి పూట జనసేన శ్రేణులు ఇళ్ల వద్దకు వచ్చి వినతిపత్రం కార్యక్రమాన్ని వాయిదా వేసుకోకపోతే తమపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని పేర్కొన్నారు. రాత్రి పూట బెదిరింపులకు పాల్పడుతూ, గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం చాలా దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలు కాలరాసి నట్లేనని అన్నారు. వైసీపీ మిడిసి పాటు ఎంతో కాలం సాగదని అన్నారు. పోలీసుల గృహ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు గాలికి వదిలేసి నియోజకవర్గంలో చీటికీమాటికీ సంబరాలు చేసుకుంటుంటే తప్పులేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల తరపున పోరాడుతున్న జనసేన శ్రేణులకు మాత్రమే కరోనా నిబంధనలు గుర్తుకు వస్తాయా అని ఆక్రోశించారు.