కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. లోన్ ఇప్పిస్తామని రూ.60 లక్షలకు టోకరా

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అపరిచిత వ్యక్తులకు కాల్‌చేసి లోన్ ఇప్పిస్తామని సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుండి రూ. 60 లక్షలు కొల్లగొట్టారు. అతడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేపట్టారు. లోన్ పేరుతో నమ్మించి.. వారి ఖాతాలలోని సొమ్మును కొల్లగొడుతున్న నిందితుడు శైకుల్‌ఖాన్ ను అరెస్టు చేశారు. ఇతను రాజస్తాన్‌లోని భరత్‌పుర్ ఉబాకకు చెందిన వ్యక్తిగా తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.