నిధుల దుర్వినియోగం కేసు: హైదరాబాద్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): నగర చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి అనిశెట్టి శ్రీదేవిని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూర్లో సిడిపిఒగా పనిచేసిన సమయంలో నిధుల దర్వినియోగానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చులపై నకిలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 322 అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ. 65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.