హైదరాబాద్‌లో దక్షిణ భారత్‌లోనే అత్యంత ఎత్తయిన భవనం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజధానిలో సౌత్ ఇండియాలోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాల భవనం నిర్మాణం కాబోతోంది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్‌లో 57 అంతస్తుల భవనాన్ని 4.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఐదు టవర్లలో 235 ఇండ్లను నిర్మించబోతున్నారు. బెంగళూరులోని 50 అంతస్తులను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన భవనంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. దీనిని SAS Infra నిర్మిస్తోంది. 57 అంతస్తుల భవన నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా అనుమతి ఇచ్చింది.