మరోసారి పెట్రోల్ ధరలు పెంపు.. ఎంతంటే?

హైదరాబాద్ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.21 , డీజిల్ ధర రూ. 103.03 కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో లీటరు పెట్రోల్ పై 87 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ. 119.07 కి చేరింది. డీజిల్పై 87 పైసలు పెరిగి.. డీజిల్ ధర రూ. 104.78 కి చేరుకుంది. గత 13 రోజుల వ్యవధిలో 11 సార్లు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు జరగగా.. రూ. 8 కి పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.