ఐపిఎల్ చరిత్రలోనే హైదరాబాద్ జట్టు మరోసారి రికార్డ్ బ్రేక్

బెంగళూరు (CLiC2NEWS): చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం సాయంత్రం బెంగళూరుతో హైదరాబాద్ తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన బెంగళూరు టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ మరోసారి అత్యధిక పరుగులు చేఇస సరికొత్త రికార్డును నమోదు చేసింది. తన రికార్డును తానే బ్రేక్ చేసి మరో సంచలనం సృష్టించింది. బెంగళూరుపై 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఈ సీజన్‌లోనే జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై 277/3 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే.