IND vs AU: 50 ఓవర్లలో 240 పరుగులు చేసిన భారత్

ఆహ్మదాబాద్ (CLiC2NEWS): ప్రపంచకప్ ఫైనల్లో భారత్ బ్యాటింగ్ ముగిసేసరికి.. రోహిత్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌటయింది. వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఆలౌట్ కావడం ఇదే. ఆసీస్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు.. కట్లుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ బ్యాటర్ల భారీ స్కోర్‌కు అడ్డుకట్ట వేసింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రికార్డుల మోత మోగించిన దిగ్గజాలు సైతం ఆసీస్ బౌలింగ్‌కు స్వల్ప స్కోర్లు నమోదు చేశారు.
సూర్యకుమార్ 18, రోహిత్ శర్మ 47, విరాట్ కోహ్లీ (54), కెఎల్ రాహుల్ (66) ఆర్థశతకాలు చేశారు. రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. బాల్ బౌండరీ దాటకుండా ఆసీస్ కట్టుదిట్టం చేసింది. భారత ఇన్నింగ్స్‌లో కేవలం 13 ఫోర్లు, మూడు సిక్స్ లు మాత్రమే నమోదవ్వడం గమనార్హం.