ఆసీస్‌పై భారత్ ఘనవిజయం
సిరీస్ భారత్ కైవసం

ఇండోర్ (CLiC2NEWS): ఇండోర్ స్టేడియంలో అస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 28.2 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌలయింది. భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 400 పరుగుల భారీ లక్ష్యాన్ని కాంగారుల ముందుంచింది. కానీ 9 ఓవర్ల అనంతరం వర్షం కారణంగా అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. దీంతో పరుగుల లక్ష్యం కూడా 317 పరుగులకు తగ్గింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో 217 పరుగులకే ఆలౌటయింది. దీంతో 99 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.