భారత్‌పై బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో విజయం
Asia Cup: ఆసియా కప్ సూపర్ -4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. శుక్రవారం భారత్, బంగ్లాదేశ్‌తో తలపడింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.5 ఓవర్లో 259 పరుగులు చేసి ఆలౌటయింది. శభ్‌మన్ గిల్ (121) ఈ మ్యాచ్‌లో శతకం సాధించాడు.