IND vs SRI: ఆసియా క‌ప్ 2023 సూప‌ర్ -4

భార‌త్ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేసిన లంక చిన్నోడు!

Asia Cup 2023 కొలంబొ (CLiC2NEWS): భార‌త్, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య ఆసియా క‌ప్ సూప‌ర్ – 4 మ్యాచ్ జ‌రుగుతోంది. సోమ‌వారం భార‌త్ జ‌ట్టు పాకిస్థాన్‌పై విజ‌యం సాధించి.. మంగ‌ళ‌వారం శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డుతోంది. తొలుత టాస్ గెలిచిన భార‌త్ జ‌ట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. మొత్తం 49.1 ఓవ‌ర్లలో 213 ప‌రుగులు చేసి టీమ్ ఇండియా ఆలౌట‌యింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (53) కెలెల్ రాహుల్ (39), ఇషాన్ కిష‌న్ (33), అక్ష‌ర్ ప‌టేల్ (26), శ‌భ్‌మ‌న్ గిల్ (19) ప‌రుగులు చేశారు.

శ్రీ‌లంక స్పిన్న‌ర్ దునిత్ వెల్ల‌లాగే 5 వికెట్లు తీసి భార‌త బ్య‌ట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశాడు. వ‌రుస‌గా రోహిత్ శుభ్‌మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యే ల‌ను ఔట్ చేశాడు. పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన కోహ్లీ కేవ‌లం సింగ‌ల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

Leave A Reply

Your email address will not be published.