India Corona: కొత్త కేసులు 37,593

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్‌ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 37,593 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కు పెరిగాయి.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు.
  • తాజా రిక‌వ‌రీల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,17,54,281 మంది కోలుకున్నారు.
  • మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు.
  • తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో వైరస్‌ బారినపడి 4,35,758 మంది మృత్యువాతపడ్డారు.
  • ప్రస్తుతం దేశంలో 3,22,327 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 17,92,755 నమూనాలను పరిశీలించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పేర్కొంది.
  • ఇప్ప‌టి వరకు మొత్తం దేశంలో 51,11,84,547 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.
Leave A Reply

Your email address will not be published.