India Corona: కొత్తగా 44,658 కేసులు.. మరణాలు 496

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 44,658 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా కరోనా వల్ల 496 మంది మరణించారు.
- దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861
- ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు: 3,26,03,188
- ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినుండి మొత్తం కోలుకున్నవారు: 3,18,21,428
- ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు: 3,44,899
- ఇప్పటి వరకు 61 కోట్ల మంది కోవిడ్ టీకాలు వేయించుకున్నారు.
అయితే 24 గంటల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు కేరళలో నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 30 వేల కేసులు వచ్చాయి. 162 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.