హెచ్ఐవి వ్యాధిని అదుపుచేసే ఇంజెక్ష‌న్‌

హెచ్ ఐవి వ్యాధిని అదుపు చేసే ఇంజెక్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాధిని అదుపులో ఉంచేందుకు రోజు ట్యాబెలెట్‌లు వాడాల్సి ఉంది. ట్యాబ్లెట్ల స్థానంలో ఇంజెక్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. వ్యాధి విస్త‌ర‌ణ‌ను అడ్డుకునే ఈ ఇంజెక్ష‌న్ సంవ‌త్స‌రానికి రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్ష‌న్ తో వ్యాధి వ్యాప్తిని నిరోధించ‌గ‌ల‌మ‌ని నిపుణులు అంటున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా 13 ల‌క్ష‌ల మంది బారిన ప‌డుతున్నార‌ని.. వీరి కోసం లెన‌కాప‌విర్ అనే ఇంజ‌క్ష‌న్‌ను బ‌హుళ జాతి మెడిక‌ల్ సంస్థ గిలీడ్ సైన్సెస్ ఆవిష్క‌రించింది. దీన్ని యుజుట్గొ అనే బ్రాండుపై విక్ర‌యించ‌నుంది.  హెచ్ఐవి వ్యాధి ఒక‌రి నుండి మ‌రొక‌రికి వ్యాప్తి చెంద‌కుండా ఈ ఇంజెక్ష‌న్ నిరోధిస్తుంద‌ని, పెద్ద‌లు- పిల్ల‌ల‌పై నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఈ వియం గిలీడ్ సైన్సెస్ వెల్ల‌డించింది. దీనిపై ఆఫ్రికా దేశాల్లో ఔష‌ధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 99.9శాతం స‌మ‌ర్ధ‌త క‌నిపించిన‌ట్లు స‌మాచారం. ఏడాదికి రెండు సార్లు ఈ ఇంజెక్ష‌న్ తీసుకోవాలంటే అయ్యే ఖ‌ర్చు రూ. 28,218 డాల‌ర్లు . అంటే సుమారు రూ.24.40 ల‌క్ష‌లు ఉంటుంద‌ని స‌మాచారం. సంప‌న్న దేశాలు సైతం దీని ధ‌ర‌ను బ‌రించ‌లేని స్థాయిలో ఉంది. ఈ ఇంజెక్ష‌న్ ధ‌ర త‌గ్గించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.