బ‌హుమ‌తి ఏదైనా ఇస్తే.. అది నాకే ఇవ్వాలి: మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖ (CLiC2NEWS): ఎపిలోని విశాఖ‌ప‌ట్ట‌ణంలో యోగాంధ్ర-2025 కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎపి మంత్రి అచ్చెన్నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సిఎం చంద్ర‌బాబు యోగా చేయ‌గ‌ల‌వా.. అని అడిగారు. చేయ‌లేక‌పోతే విశాఖ‌లో జ‌రిగే ఈవెంట్‌కు రావొద్ద‌ని చెప్పారు. ఆయ‌న మాట‌ల్ని ప‌ట్టుద‌ల‌గా తీసుకుని యోగాస‌నాలు వేశాన‌ని ఆయ‌న తెలిపారు. ఈవెంట్లో వ్య‌క్తిగ‌తంగా బ‌హుమ‌తులు ఏవైనా ఇస్తే.. త‌న‌కే మెద‌టి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని అచ్చెన్నాయుడు అన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యోగాంధ్ర – 2025 కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌రైయ్యారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్భంగా విశాఖ‌లో సుమారు 3 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ స‌హా రాష్ట్ర సిఎం చంద్ర‌బాబు, డిప్యూటి సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ , మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.