అక్టోబరు 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

హైదరాబాద్ (CLiC2NEWS ): తెలంగాణలో క్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రస్తుతం సెకండియర్లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు.70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒకట్రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉండనున్నారు.
పరీక్షల షెడ్యూల్
- అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్
- అక్టోబర్ 26న: ఇంగ్లీష్ పేపర్ 1
- అక్టోబర్ 27న: మాథ్స్ పేపర్1a,బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ 1
- అక్టోబర్ 28న: మాథ్స్ పేపవర్ 1బీ, జూవాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
- అక్టోబర్ 29న: ఫిజిక్స్ పేపర్1, ఎకనమిక్స్ పేపర్1
- అక్టోబర్ 30 న: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
- నవంబర్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
- 2న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.