AP: ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేవ్లో ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు ఒకేసారి ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా బుధవారంతో పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెగ్యలర్, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం కలిపి ప్రమథమ సంవత్సరం 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.