Mandapeta: `మహిళలకు పెద్దపీట వేస్తూ.. పద్మకు చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషం..`
మండపేట (CLiC2NEWS): ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ.. మహిళలకు పెద్దపీట వేస్తూ దూలం పద్మకు చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషం అని మండపేట శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు పెంకే గంగాధర్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు సతీమణి పద్మకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెంకే గంగాధర్ నేతృత్వంలో శెట్టిబలిజ సంఘం నాయకులు కేశవరం వెంకన్నబాబు నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. గంగాధర్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పదవులు భర్తీ చేశారని అన్నారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేశారని అన్నారు. ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేస్తూ పద్మకు చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి వెంకన్నబాబు వైసీపీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ వచ్చారని అన్నారు. ఇటువంటి నాయకులకు పదవులు రావడం సముచితమేనని అన్నారు. కార్యక్రమంలో పిల్లి రాజు, గుత్తుల గణేష్, రామోజి కృష్ణ, చొల్లంగి సూరిబాబు పాల్గొన్నారు.